ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయిన తెలుగు సినీ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు ఇషా చావ్లా కూడా చేరింది. ఈ యువ అందాల భామ ట్విట్టర్ కి గుడ్ బై చెప్పి తన ఎకౌంటుని డిలీట్ చేసారు. అభిమానుల కొన్ని కామెంట్స్ కి బాధ పడి ట్విట్టర్ కి బై చెప్పారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘శ్రీ మన్నారాయణ’ చిత్రంలో కథానాయికగా నటించిన ఇషా చావ్లా ఈ చిత్రంలో ‘తక తై’ పాటలో బాలకృష్ణకి ఇచ్చిన ముద్దు సీన్ గురించి ఆమె స్పందించారు. ముద్దు సీన్ లాంటిది ఏమీ లేదని అది అసలైన షాట్ కాదని చెప్పింది. ఆ స్టేట్మెంట్ కి కుప్పలు కుప్పలుగా కామెంట్స్ వచ్చి పడ్డాయి మరియు ఆ కామెంట్స్ ఇషా చావ్లాని బాధ పెట్టడంతో ఆమె ట్విట్టర్ నుండి తప్పుకున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అభిమానులకు రెగ్యలర్ గా టచ్ లో ఉండలేక ట్విట్టర్ నుండి తప్పుకున్నారు.