రవితేజపై వాంటెడ్ నెగిటివిటీ!? కానీ ఎందుకు?

Ravi tej

తనదైన సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి ఎంతో ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చి తన స్వశక్తితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. కొన్నాళ్ల కితం వరకు తన విజయాన్నే తమ విజయంగా భావించే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా తనపై పాజిటివ్ కంటే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ టాక్సిక్ సోషల్ మీడియా యుగంలో చేతిలో మొబైల్ ఉంటే చాలు కనీసం ఆలోచన లేకుండా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటున్నారు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్.

సినిమా చూడకుండానే బాలేదు అంటారు రిలీజ్ రోజే డిజాస్టర్ అంటూ నెగిటివ్ ట్రెండ్ లు చేస్తారు. ఇంకా చాలా తతంగమే సోషల్ మీడియాలో వెగటు పెట్టించే రేంజ్ లో తీసుకెళ్తున్నారు. ఇదే ఇప్పుడు రవితేజ విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పాలి. తాజాగా రవితేజ నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ అంటూ పుట్టించిన పుకారు యిట్టే వైరల్ అయ్యింది.

అది ఎంతవరకు నిజం, అబద్దం అని ఆరా తీసింది లేదు కానీ ఇవన్నీ చేస్తే వారికేం వస్తుందో అలా చేస్తున్న వారికే తెలియాలి. ఓ రకంగా చూస్తే ఇదంతా నిష్కారణంగానే జరుగుతున్న క్యాంపైన్ గా కూడా న్యూట్రల్ ఆడియెన్స్ కి అనిపిస్తుంది. ఎక్కడి వరకు ఎందుకు మొన్ననే వచ్చిన మాస్ జాతర థియేటర్స్ లో ఉన్నపుడు టాక్ ఒకలా వచ్చింది. ఓటిటిలోకి వచ్చాక ఒకలా వచ్చింది. సో ఈ డ్యామేజ్ అంతా ఎప్పటికి ఆగుతుందో చూడాలి.

Exit mobile version