మెగా బ్రదర్ నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ్ మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ సినిమాకు సంబందించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి జరుగనుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా సాఫ్ట్ గా, సైలెంట్ గా కనిపించనున్నాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం చాలా తెలివైన వాడని ఒక యంగ్ హీరో గతంలో తెలియజేశాడు. ఈ సినిమాలో స్పెషల్ గా కనిపించడానికి వరుణ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని, అలాగే డాన్స్ విషయంలో కూడా చాలా కష్టపడుతున్నాడని సమాచారం. తను చాలా పొడవుగా, చూడటానికి అందంగా వున్న ఈ మెగా ఫ్యామిలీ హీరో తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తాడని అంటున్నారు. వరుణ్ తేజ్ మొదటి సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం దర్శకత్వం వహించనున్నాడు. వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉండనున్నాడో తెలియాలంటే ఇంకొద్ది కాలం వేచి చూడాలి.