తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ ఫుల్ మరియు మంచి పేరు తెచ్చుకున్న కథానాయికలలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష కూడా ఒకరు. దశాబ్ద కాలంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయ్యారు.
ప్రస్తుతం అంతగా ఆఫర్లు లేని ఈ భామకి తెలుగులో ఒక్క పెద్ద చిత్రం కూడా చేతిలో లేకపోవడం చెప్పుకోదగ్గ విషయం, ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఈ విషయం గురించి త్రిషని అడిగితే త్రిష సమాధానమిస్తూ ‘ తెలుగు సినీ అభిమానులు నా నటనని ఎంతో ప్రోత్సహించారు మరియు నాపై ఎంతో అభిమానాన్ని చూపించారు. ఇలానే ఇంకా మంచి సినిమాలు చేస్తూ జీవితాంతం వారి అభిమానాన్ని అందుకోవాలని ఉంది. ముందు ముందు ఇంకా మంచి పాత్రలు చేసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సినిమాల కోసం చూస్తున్నానని’ ఆమె అన్నారు.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పోటీకి మరియు ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పుల దృష్ట్యా త్రిష కోరిక నెరవేరడం కొంచెం కష్టమే.. ఏమంటారు ఫ్రెండ్స్?