ఎన్టీఆర్ భయం అదే.. అందుకే త్రివిక్రంతో..!

ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం దీనిపై ప్రకటన రాగా, మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఎన్టీఆర్ కొరకు అనేక మంది దర్శకులు క్యూలో ఉండగా త్రివిక్రమ్ వైపే ఆయన మొగ్గు చూపడానికి కారణం ఏమిటనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడమే దీనికి ప్రధాన కారణం అని అందరూ అనుకున్నారు. ఐతే ఎన్టీఆర్ ఆలోచన వేరుగా ఉందని సమాచారం.

ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సౌత్ లో స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి వారు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ తో సినిమా ఓ కే చేసుకొని అతిపెద్ద సినిమా పరిశ్రమలలో ఒకటైన టాలీవుడ్ లో పాగా వేయాలని చూశారు. ఐతే ఎన్టీఆర్ వారికి ప్రస్తుతాని అవకాశం ఇవ్వలేదు. పొరుగు పరిశ్రమలకు చెందిన దర్శకుల కథలు, టేకింగ్ మన నేటివిటీకి సరిపడకపోవచ్చు. గతంలో కొంత మంది హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేసి దెబ్భై పోయిఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ వారితో సినిమా చేయడం సేఫ్ కాదని భావించి ఉంటారు.

అలాగే రాజమౌళి హీరోల నెక్స్ట్ మూవీ ప్లాప్ సెంటిమెంట్ ఎటూ ఉండనే ఉంది. కాబట్టి సేఫ్ డైరెక్టర్ ని ఎంచుకోవడమే బెటర్ అని భావించి ఉండవచ్చు. ఇక త్రివిక్రమ్ ట్రాక్ చూస్తే బ్లాక్ బస్టర్ లేదా అబౌ యావరేజ్ సినిమాలు ఇచ్చారు. డిజాస్టర్ గా ఒక్క అజ్ఞాతవాసి ఉంది. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఓటేశాడని అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ తన 31వ చిత్రం మాత్రం అట్లీ లేదా ప్రశాంత్ నీల్ తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version