‘అఖండ 2’ ట్రైలర్ బ్లాస్ట్.. ఇక్కడేనా?

‘అఖండ 2’ ట్రైలర్ బ్లాస్ట్.. ఇక్కడేనా?

Published on Nov 19, 2025 1:01 PM IST

Akhanda2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు అభిమానులకి మంచి ట్రీట్ అందిస్తున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ పై సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది.

దీని ప్రకారం మేకర్స్ ఈ ట్రైలర్ లాంచ్ ని కర్ణాటకలో చింతామణి ప్రాంతంలో విడుదల చేయనున్నట్టు వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. అలాగే ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అతి త్వరలోనే అనౌన్స్ కానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు