ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ నుంచి వచ్చిన లేటెస్ట్ స్నాప్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసాయి. దీనితో ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం తాలుకా టీజర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి.
ఈ దీపావళికే టీజర్ వస్తుంది అన్న టాక్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర థమన్ “వకీల్ సాబ్” రికార్డింగ్ సెషన్ లో తన టీం బిజీగా ఉన్నట్టుగా తెలిపారు. మరి ఇది టీజర్ కు సంబంధించిందా లేక పాటలకా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడెలాగో టీజర్ ను ప్రిపేర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. మరి పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ టీజర్ ఎప్పుడు విడుదల కానుందో చూడాలి. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే నివేతా థామస్, అంజలిలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
#VakeelSaab ????????♂️???????????? #Woohooooo !!! @SVC_official ♥️???? https://t.co/jDKnmcUSg8
— thaman S (@MusicThaman) November 5, 2020