ఈ సినిమాలు ఇంతేనా?

ఈ సినిమాలు ఇంతేనా?

Published on Dec 2, 2012 6:44 PM IST

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున ‘ఢమరుకం’ మూడు సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడి చివరికి ఇటీవల నవంబర్ 23న విడుదలైన విషయం తెలిసిందే. ఆర్ధిక సమస్యల వల్ల ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఇదే వరసలో చిన్న సినిమాలు కూడా నడుస్తున్నాయి. నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటించిన ‘ఒక్కడినే’ మొదటిగా డిసెంబర్ 7న విడుదల చేస్తామని ప్రకటించి డిసెంబర్ 14కి వాయిదా వేసారు. నాని, సమంతల ‘ఎటో వెళ్ళిపోయింది’ మనసు కూడా ఆర్ధిక సమస్యల వల్ల ఆగుతూ డిసెంబర్ 14న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి రూపొందించిన ‘జీనియస్’ సినిమా కూడా డిసెంబర్ 7 విడుదల ప్రకటించి డిసెంబర్ 21కి వాయిదా వేసారు. మంచు లక్ష్మి, ఆది, సందీప్ కిషన్, తాప్సీ కలిసి నటిస్తున్న గుండెల్లో గోదారి ఆడియో విడుదలై చాలా కాలమైనా సినిమా విడుదల విషయంలో ఇప్పటి వరకు ఇంత వరకు క్లారిటీ లేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం, పెద్ద సినిమాలతో పోటీ పడడానికి వెనుకంజ వేయడం, ఆర్ధిక సమస్యలు ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

తాజా వార్తలు