ఇదంతా పవన్ పై ప్రేమతోనేనా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక్క ఆడియెన్స్ లోనే కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. హీరోలు, ఆర్టిస్టులు దర్శకులు నిర్మాతలలో కూడా పవన్ అంటే అభిమానించేవారు ఉన్నారు. అలాంటి అభిమానులలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో చిత్రాలను నిర్మించిన దిల్ రాజు కెరీర్ లో డ్రీం ప్రాజెక్ట్ మాత్రం పవన్ తో ఒక సినిమా తీయడమే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అలా ఎంతో కాలం సస్పెన్స్ అనంతరం మొదలుపెట్టిన చిత్రమే “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ మధ్యలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడంతో ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అవుతుందా అవ్వదా అన్న సంశయం మొదలయ్యింది. ఇపుడు ఈలోపునే గత రెండు మూడు రోజుల నుంచి అమెజాన్ ప్రైమ్ వారు వకీల్ సాబ్ కు 80 నుంచి 100 కోట్లు భారీ ఆఫర్ ను ముందుంచారని టాక్ విపరీతంగా హాట్ టాపిక్ అయ్యింది.

కానీ దిల్ రాజు మాత్రం ఈ భారీ ఆఫర్ ను ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించారని తెలుస్తుంది. చాలా కాలం తర్వాత నుంచి పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో చాలా వరకు అభిమానులు కాస్త లేట్ అయినా సరే ఆ ఫీల్ ను సిల్వర్ స్క్రీన్ పైనే చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే అదే భావనలో పవన్ కు అభిమాని అయిన దిల్ రాజు కూడా ఐ=ఉండడంతోనే అంత ఆఫర్ వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసి ఉండొచ్చని చెప్పాలి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఒకవేళ నిజమయితే ఖచ్చితంగా పవన్ మీదున్న ప్రేమతోనే అని చెప్పాలి.

Exit mobile version