“మాస్టర్” టీజర్ మరో సెన్సేషన్ అవుతుందా?

“మాస్టర్” టీజర్ మరో సెన్సేషన్ అవుతుందా?

Published on Nov 14, 2020 7:05 AM IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా హిట్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్టర్”. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం కోసమే కోలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా వల్ల ఇది కూడా ఆగాల్సి వచ్చింది. దీనితో ఈ భారీ చిత్రం విడుదల ఇప్పుడా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ గ్యాప్ లో మేకర్స్ “మాస్టర్” టీజర్ ను ఈ దీపావళి బ్లాస్ట్ గా రెడీ చేసి అలెర్ట్ చేసారు. దీనితో ఇక్కడ నుంచి అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. విజయ్ సినిమాల టీజర్ వస్తుంది అంటే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగుతుంది. కనీ వినీ ఎరుగని రెస్పాన్స్ తో విజయ్ ఫ్యాన్స్ ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ రికార్డ్స్ ను సెట్ చేస్తారు.

అలాగే ఇప్పుడు మాస్టర్ టీజర్ కు కూడా అంతకు మించిన స్థాయిలో రికార్డులు సెట్ చెయ్యాలని విజయ్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఈ దీపావళి సందర్భంగా రానున్న ఈ టీజర్ తో విజయ్ ఎంతటి సెన్సేషన్ నమోదు చేస్తారో చూడాలి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందివ్వగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ లో కనిపిస్తున్నారు.

తాజా వార్తలు