‘కూలీ’ తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!?

ప్రస్తుతం సౌత్ లో గట్టి హైప్ ని సెట్ చేసుకొని అదరగొట్టేందుకు వస్తున్న భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కూలీ” అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ అలాగే ఉపేంద్ర లాంటి స్టార్స్ కలయికలో టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ వర్క్ కోసం తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించే లేటెస్ట్ న్యూస్ అయితే తెలుస్తుంది. దీనితో ఈ ఆగస్ట్ 7న తెలుగులో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ సహా కింగ్ నాగ్ మరియు ఉపేంద్ర కూడా హాజరయ్యే ఛాన్స్ ఉందట. అలాగే హిందీ ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ జాయిన్ అవుతారని వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం కూలీ బాబా రాక కోసం ఎగ్జైట్మెంట్ మరింత పెరుగుతూ వస్తుంది.

Exit mobile version