సుశాంత్ మరణం మిస్టరీగా మిగిలిపోనుందా?

గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణ వార్త మొత్తం దేశ వ్యాప్తంగా ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. అసలు సుశాంత్ ది ఆత్మ హత్యా లేక హత్యా అన్నది ఇంకా తేలకపోవడంతో సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు ఆందోళన లోనే ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా ఆ మధ్య అంతా కూడా అనేక మలుపులు తిప్పిన ఈ కేసు అంతం ఎలా ఉంటుందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనితో సోషల్ మీడియాలో మళ్ళీ అతని అభిమానులు ఆందోళన మొదలు పెట్టారు ట్రెండ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు సిబిఐ ఎందుకు ఇంకా మౌనంగా ఉందని అసలు ప్రశ్న.

వారు ఈ కేసును ఇంకా క కొలిక్కి తీసుకు రాలేదు. అంతే కాకుండా ఆ మధ్య అది ఆత్మ హత్యే అని చెప్పినా హత్య కాదు అనడానికి కూడా సరైన వివరణ ఇవ్వలేదు. దీనితో మళ్ళీ మొదటికే వచ్చింది. ఇక అక్కడ నుంచి మెల్లగా ఈ యేసు ఫేడ్ అవుట్ అవ్వడం మొదలు పెట్టింది. దీనితో సుశాంత్ మరణం ఒక మిస్టరీగా మిగిలిపోతుందా అన్న సందేహం ఇప్పుడు వ్యక్తం అవుతుంది.

Exit mobile version