
నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆల్బమ్ లో తక్కువ పాటలే ఉన్నాయా అంటే అవుననే అనిపిస్తుంది.
ఇంకా సినిమా రిలీజ్ కి సగం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మొదటి సాంగ్ వస్తుంది. సో మిగతా ఎన్ని పాటలు ఉన్నా ఈ సగం రోజుల్లోనే రావాల్సి ఉంది. సో బహుశా ఆల్బమ్ లో తక్కువ పాటలే ఉండి ఉండాలని చెప్పాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే అవన్నీ ఇక ఏదో సమయం లేక అరకొరగా విడుదల చేసుకున్నట్టే అవుతుంది.
గత సినిమాకు మాత్రం ఇలా జరగలేదు. కానీ ఈ సినిమా విషయంలో జాప్యం బాగా నెలకొంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు. అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

