యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న ఓ మహా యాగం “రౌద్రం రణం రుధిరం”. భారీ పాన్ ఇంద్రియఞ్చ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ కు చేరువలో ఉంది.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ను జక్కన ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతున్న ఈ చిత్రాన్ని ఓ సమయానికి రాజమౌళి లాక్ చేసినట్టుగా సినీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతుంది.
ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా సీజన్ కు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పటికే చాలా మేర ఆలస్యం అయ్యిన ఈ చిత్రాన్ని వేసవిలో వస్తుంది అని రెడీగా ఉన్నారు. కానీ ఈ టాక్ అభిమానులకు ఇప్పటి నుంచే కాస్త అసహనం తెచ్చిపెడుతుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ పై తెర పడదు.