ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం అఖండ 2 తాండవం కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ చిత్రం షూటింగ్ ఇపుడు అంతిమ దశలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ ఇపుడు ఆ అనుకున్న డేట్ లో వచ్చే సూచనలు మరింత తగ్గిపోయాయి.
నిన్న వినాయక చవితికి కానుకగా మేకర్స్ నుంచి చిన్న అప్డేట్ అయినా అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ మౌనంగానే ఉండే సరికి బాలయ్య సినిమా లేనట్టే అని దాదాపు ఖరారు అయ్యింది. అయితే ఈ మౌనం వెనుక మరో కారణం ఉందా అనే టాక్ కూడా ఉంది. రీసెంట్ గానే నందమూరి ఇంట ఓ విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ కారణం చేత కూడా సినిమా, అప్డేట్స్ ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. సో అఖండ 2 డిసెంబర్ 4 లేదా తేదీల్లో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా లేటెస్ట్ టాక్. మరి దీనిపై అసలు క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.