మన దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి మొదట తాను హీరోయిన్ గానే వచ్చినా తర్వాత మాత్రం “మహానటి” చిత్రంతో భారీ ఫేమ్ ను ఒక్క సరిగా సంతరించుకుంది కీర్తి సురేష్. ఇక అక్కడ నుంచి కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. అలా అక్కడ నుంచి మరిన్ని అలంటి అవకాశాలను అందుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఈ అవకాశాలు సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది అని చెప్పాలి.
ఈ లాక్ డౌన్ సమయంలో తాను నటించిన రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి విడుదలకు వచ్చాయి. కానీ ఈ రెండు చిత్రాలు కూడా కనీసం అంటే ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. లాక్ డౌన్ ఆరంభంలో “పెంగ్విన్” భారీ హైప్ తో వచ్చి ప్లాప్ గా టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన “మిస్ ఇండియా” చూసి అయితే అభిమానులే కీర్తీ ఛాయిస్ బాలేదని మాట్లాడుకుంటుంన్నారు. ఇక నున్నచీ అయినా సరే ఇలాటి సినిమాలు టేకప్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలని అంటునారు.
ఒకరకంగా వారి అభిప్రాయం కూడా సరైనదే అని చెప్పొచ్చు. కీర్తీ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాయిస్ అలాంటిది ఇలాంటి ఆఫర్స్ ఓకె చేసి ప్లాప్స్ అందుకోవడం ఆమెకు మరిన్ని సినిమాలను అలాగే ఆదరణను దూరం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కేవలం మాములు సినిమాలు తప్పితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలను మన వాళ్ళు తక్కువగా ఆదరించే అవకాశం కలుగుతుంది. అందుకే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కీర్తీ పక్కాగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయితే బెటర్.