దీపికానే ట్రబుల్ మేకరా?

దీపికానే ట్రబుల్ మేకరా?

Published on Sep 18, 2025 2:09 PM IST

deepika-padukone

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వైరల్ గా వినిపిస్తున్న వార్తల్లో ఒకటి కల్కి 2 ఇంకా ఆ సినిమాలో గతంలో కనిపించిన నటి దీపికా పదుకోణ్ కోసం అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించిన ఈ సినిమాలో దీపికాకి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో కీలక పాత్ర ఇచ్చి ఎలివేట్ చేశారు.

దీనితో తెలుగులో ఒక సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న దీపికా పార్ట్ 2 లో తప్పకుండా ఉంటుంది అనే టాక్ కొనసాగింది కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఇచ్చిన ఒక షాకింగ్ అనౌన్సమెంట్ మాత్రం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీనితో దీపికా పదుకోణ్ పై పలు కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి ముందు ప్రభాస్ తోనే “స్పిరిట్” విషయంలో దీపికా పేరు మొదట అనుకుంటే ఆమెకి ఆ సినిమా మేకర్స్ కి కుదరక ఆమె స్థానాన్ని అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి భర్తీ చేసింది. ఇక లేటెస్ట్ గా వైజయంతి వారు ట్వీట్ లో కూడా తమ ప్రాజెక్ట్ కి కమిట్మెంట్, అంతకు మించి కావాలని నొక్కి చెప్పడంతో ఇక్కడ ట్రబుల్ మేకర్ గా దీపికా పేరునే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీపికా ఏమన్నా దీనికి బదులిస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు