పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న అవైటెడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఇది వరకే ఫస్ట్ సింగిల్ రావాల్సి ఉంది. అయితే ఇది వాయిదా పడింది కానీ లేటెస్ట్ బజ్ అయితే ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై వినిపిస్తోంది.
దీని ప్రకారం ఈ నవంబర్ 5న సాంగ్ రావచ్చని తెలుస్తోంది. సో ప్రభాస్ అభిమానులు ఆరోజు కూడా వైట్ చెయ్యాలని చెప్పాలి. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలో వస్తుంది అని వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
