ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా మాత్రమే కాకుండా ప్రపంచ సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ సూపర్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి.
మహేష్ బాబు కెరీర్లో 29వ ప్రాజెక్ట్ గా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా బిగ్ అప్డేట్ ని మేకర్స్ ఈ నవంబర్ లో లాక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నవంబర్ లో ఎపుడు దీని డేట్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం నవంబర్ 16న అయితే ఈ ట్రీట్ గ్రాండ్ మ్యానర్ లో రివీల్ కానున్నట్టుగా ఇప్పుడు టాక్. దెబ్బకి దేశ వ్యాప్తంగా మొత్తం షేక్ అవుతుంది అని వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.