మెగాస్టార్ ఆ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందా?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి కాబడిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే చిరు మరో రెండు క్రేజీ రీమేక్ చిత్రాలను కూడా లైన్ లో పెట్టుకున్నారు.

అవి ఏంటో కూడా అందరికి తెలిసిందే. అయితే వీటిలో సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ తో ప్లాన్ చేస్తున్న వేదాళం రీమేక్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలోని కథానుసారం కోల్ కతా లో కొన్ని కీలక సీన్స్ ఉంటాయి. వాటిని మేకర్స్ తీసినట్టు తెలుస్తుంది. అయితే వాటికి చిరు ఉండాల్సిన స్పేస్ లేదు. అందుకే ముందు వాటిని ప్లాన్ చేసుకున్నారని సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version