బిగ్ బాస్ 4 – హారిక మౌనానికి అభిజీత్ కారణమా.?

బిగ్ బాస్ 4 – హారిక మౌనానికి అభిజీత్ కారణమా.?

Published on Dec 30, 2020 7:00 AM IST

కొన్ని రోజుల కితమే మన తెలుగు అతి పెద్ద రియాలిటీ షో అయినటివంటి బిగ్ బాస్ సీజన్ 4 పూర్తయ్యింది. అయితే ఈ సీజన్లో కూడా మంచి రసవత్తర ఘటనలే చోటు చేసుకున్నాయి. అలా కొన్ని జంటలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచాయి. మరి ఇదిలా ఉంటే అలా మంచి హాట్ టాపిక్ అయ్యిన జంట ఎవరన్నా అంటే అది అభిజీత్ మరియు హారికాల కాంబో అని కూడా చెప్పాలి.

లాస్ట్ సీజన్ అంత కాకపోయినా ఈసారి వీరు మరియు అఖిల్ మోనాల్ ల ట్రాక్ బాగా వచ్చింది. సరే అంతా బయటకొచ్చారు బాగా కనిపిస్తున్నారు కానీ మోస్ట్ ఎనర్జిటిక్ హారికా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బహుశా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ లో కనిపించింది తప్పితే ఎక్కడా జాడనే లేదు. మరి దీనికి కారణం అభిజీతేనా అన్న అనుమానాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి.

అంత బాగా ఉన్న ఈ ఇద్దరినీ చాలా మంది లవ్ బర్డ్స్ అనే అనుకున్నారు. కానీ తీరా బయటకొచ్చాక అభిజీత్ హారికాను జస్ట్ తన స్వీట్ సిస్టర్ అని చెప్పడంతో అంతా రివర్స్ అయ్యింది. హౌస్ లో అయితే ఎప్పుడు వీరిద్దరూ అలా అనిపించింది లేదు. బయటకొచ్చాకే దూరం పెరిగింది మరి హారిక మౌనానికి అభిజీతే కారణమా మరేమన్నానా అన్నది క్లారిటీ రావాలి అంటే ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.

తాజా వార్తలు