సూపర్ స్టార్ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివ మేటి దర్శకుడు. మాస్ లో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. దాంతో మొదటి నుండి దర్శకుడు శివ పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన రజనీ ఈ ప్రాజెక్ట్ పై నమ్మకంగా ఉన్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ స్టార్ట్ కానుంది, కాకపోతే రజినీ ఇప్పట్లో షూట్ లో పాల్గొనడట. కరోనా ప్రభావం తగ్గేవరకూ శివ మిగిలిన సీన్స్ ను షూట్ చేసుకుంటాడట.

ఇకపోతే ఎక్కువగా యాక్షన్ మూవీసే చేసే శివ.. మరి సూపర్ స్టార్ తో కూడా ఫుల్ యాక్షనే ప్లాన్ చేశాడా.. లేక కొత్తధనం కోసం కొత్తగా ఏమైనా ట్రై చేశాడా అనేది చూడాలి. ఇక సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. మాస్, క్లాస్ రెండు వర్గాల చేత విజిల్ వేయించగలిగే ట్రీట్మెంట్ శివ ఇవ్వగలడని ఆయన గత సినిమాలు ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. కాబట్టే సూపర్ స్టార్ ని డైరెక్టర్ శివ ఏ స్థాయిలో చూపుతాడోనని ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Exit mobile version