బిజినెస్ లోనూ క్రేజీ హీరోనే !

బిజినెస్ లోనూ క్రేజీ హీరోనే !

Published on Mar 18, 2020 2:00 AM IST

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తూనే అటు బిజినెస్ మేన్ గానూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన బిజినెస్ ను చాల కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ ను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు మొత్తానికి తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయ దేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత అంటూ వచ్చిన రౌడీ బ్రాండ్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.

ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. ఇక ప్రస్తుతం విజయ్, పూరి ‘ఫైటర్’ మూవీతో బిజీగా ఉన్నాడు

తాజా వార్తలు