ఆ సినిమా కూడా చేస్తే ‘పూజా’ క్రేజ్ మరింతగా పెరుగుతోంది !

ఆ సినిమా కూడా చేస్తే ‘పూజా’ క్రేజ్ మరింతగా పెరుగుతోంది !

Published on Nov 2, 2020 11:35 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో చలామణి అవుతోన్న ఏకైక హీరోయిన్ ‘పూజా హెగ్డే’నే. ఈ బ్యూటీకి చాల ఈజీగా స్టార్ డమ్ వచ్చింది. ప్రస్తుతం చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ‘పూజా హెగ్డే’ అఖిల్ అక్కినేని సరసన కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తుండటంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

దీనికితోడు ఈ టాల్ బ్యూటీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా తీసుకోవాలని హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడట. ఎలాగూ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’, డీజే జగన్నాధం సినిమాలలో హీరోయిన్ గా పూజానే నటించింది. మరి పవన్ సినిమాలో కూడా నటిస్తే.. ఇక పూజా క్రేజ్ మరింతగా పెరుగుతుంది.

తాజా వార్తలు