ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ జరుపుకుంటూ రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి అవైటెడ్ చిత్రం “తండేల్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ అక్కినేని నాగ చైతన్య అలాగే సాయి పల్లవిలు హీరోయిన్స్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం ఇది కాగా మంచి అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా నార్త్ ప్రమోషన్స్ ఆల్రెడీ చేస్తుండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ ప్రమోషన్స్ లో భాగం అయ్యారు. అయితే ఈ మీట్ లో అమీర్ ఖాన్ తో ప్రాజెక్ట్ పై చందూ చేసిన కామెంట్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి. అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకి తాను ఒక ఆరు నెలలు అసిస్టెంట్ దర్శకునిగా పని చెయ్యాలి అనుకుంటున్నాను అని ఆ తర్వాత మంచి కథ చెప్తానని తనతో ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఈ కలయికలో సినిమా ఉంటుందో లేదో చూడాలి.