‘కొరటాల శివ’ పై ఇంట్రస్టింగ్ పోస్ట్ !

ఇండస్ట్రీలోకి డైలాగ్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాల శివ పుట్టిన రోజు నేడు. స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారంటే కొరటాల సాధించిన హిట్ ట్రాకే దానికి కారణం. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే ప్రేక్షుకులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు.

కాగా కొరటాల శివకి సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఓ అభిమాని పోస్ట్ చేసిన పోస్ట్ కొరటాల వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసేలా ఉంది. ఆ పోస్ట్ ‘నిస్వార్ధానికి చిరునామా మీరు.. సిద్ధాంతాల పునాది మీది.. మీకు మాత్రమే తెలిసిన మీరేంటో తెలుసుకున్న వారు ధన్యులు… జన్మదిన శుభాకాంక్షలు మీకు.. మరెన్నో అద్భుత సందేశాలు మీ నుంచి చిత్రాలుగా రావాలి.. జనం మారాలి’ అంటూ కొరటాలను ఉద్దేశించి ఓ అభిమాని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి ‍ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం షూట్ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version