‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. తన కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది కాగా భారీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ సినిమా కొంచెం గ్యాప్ తర్వాత వెంటనే నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి కంప్లీట్ చేస్తున్నారు.

ఇలా పవన్ ఇచ్చిన డేట్స్ తో హరీష్ తన మార్క్ స్పీడ్ తో కంప్లీట్ చేయగా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షూటింగ్ మొత్తం దాదాపు అయిపోవచ్చింది అని తెలుస్తుంది. ఈ రెండు రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 13తో పవన్ పోర్షన్ షూటింగ్ మొత్తం ఈ సినిమాలో పూర్తయ్యిపోతుందట. సో పవన్ సినిమా కూడా కంప్లీట్ చేసేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version