‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

Published on May 26, 2025 9:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలతో పాటుగా తాను సాలిడ్ గెస్ట్ రోల్ చేస్తున్న సినిమా కూడా ప్రస్తుతం ఒకటి ఉంది. మరి ఆ చిత్రమే “కన్నప్ప”. మంచు వారి హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో సెన్సేషనల్ హిట్ సీరియల్ మహాభారతం దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా వైడ్ గా అనేకమంది స్టార్స్ భాగం అయ్యారు.

మరి అలానే పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ని కూడా దింపారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రకి ప్రభాస్ ని తీసుకోగా ముందు చిన్న క్యామియో పాత్రకే అనుకున్నప్పటికీ కానీ నెమ్మదిగా ఇది గెస్ట్ రోల్ రేంజ్ లో మారిపోయింది. మరి ఇలా ప్రభాస్ కన్నప్ప చిత్రంలో ఏకంగా 30 నిమిషాల మేర కనిపిస్తాడట. అంతే కాకుండా ఈ 30 నిమిషాల్లో మోహన్ బాబుకి ప్రభాస్ కి నడుమ ఒక పవర్ఫుల్ పోటాపోటీ సన్నివేశం కూడా ఉంటుందని విష్ణు తెలిపాడు. మొత్తానికి మాత్రం ప్రభాస్ ని గట్టిగానే కన్నప్పలో చూపించేలా ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు