బాలయ్య సినిమాలలో భారీ ఫైట్స్ అనేవి కామన్ గా ఉండే అంశం. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయన నుండి ఆశించే అతిముఖ్యమైన అంశాల్లో అది కూడా ఒకటి. ఇక బోయపాటి సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. భారీ విలన్స్ తో సుదీర్ఘమైన పోరాటాలు బోయపాటి తన సినిమాలలో రూపొందిస్తారు. మరి ఈ ఇద్దరు కలిసి చేసే సినిమాలో పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహకు కూడా అందని అంశం. బాలయ్యతో బోయపాటి చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు బలమైన కథతో పాటు భారీ పోరాటాలు కలిగి వున్నాయి.
కాగా వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ సెట్స్ పై ఉండగా ఆ రెండు చిత్రాలకు మించిన యాక్షన్ బోయపాటి సిద్ధం చేశారట. బాలయ్య లాంటి హీరోకి సమాధానం చెప్పాలంటే అదే స్థాయిలో విలన్ గ్యాంగ్స్ ఉండాలి. అందుకే బోయపాటి ఈ మూవీలో విలన్స్ పాత్రలను ఎక్కువగానే రాసుకున్నారట. బలయమైన విలన్ గ్యాంగ్స్ తో బాలయ్య పోరాటాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించడం ఖాయం అంటున్నారు.