సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని రాత్రి పగలు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలిసింది.
ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. మాములుగా సుకుమార్ కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేస్తాడని పేరుంది. ఈ సినిమాకి సంబందించిన వారు చెప్పిన సమాచారం ప్రకారం ‘ సుకుమార్ ఈ సినిమాలో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉండే హై క్వాలిటీ ఫిల్మ్’ అని అంటున్నారు.
మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు కొనుక్కున్నారు .