తమిళ స్టార్ అజిత్ కుమార్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కాగా అజిత్ ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు అయిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఈ స్టార్ హీరో. తన జర్నీ సులభంగా సాగలేదని ఎన్నో ఇబ్బందులు ఎదురైనట్లు అజిత్ ఈ పోస్ట్ లో తెలపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అజిత్ ఇంకా తన పోస్ట్ లో ఏం తెలిపాడు అంటే.. ‘సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో నేను 33 ఏళ్లు పూర్తిచేసుకున్నాను. గడిచిన ప్రతి సంవత్సరం కూడా నాకో మైలురాయితో సమానం. అందుకే, మరిన్ని మైలురాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను’ అని అజిత్ తెలిపాడు.
అజిత్ ఇంకా మాట్లాడుతూ.. ‘మీరంతా చూపించే ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడంలేదు. ఇన్నేళ్ల నా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. బయటి వ్యక్తిగా వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నిరంతరం పరీక్షించాయి. కానీ, నేను ఎప్పుడూ ఆగిపోలేదు. పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం అదే నా బలం’ అని అజిత్ చెప్పుకొచ్చాడు.