‘అంతకు ముందు.. ఆ తరువాత’ అంటున్న సుమంత్ ఆశ్విన్

Anthaku-mundu-aa-tharuvatha

‘అలామొదలైంది’ వంటి హిట్ సినిమాను నిర్మించిన శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఇప్పుడు ‘అంతకు ముందు …ఆ తరువాత’ సినిమాని నిర్మిస్తోంది. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రేమలో పడిన యువతి యువకులు ప్రేమలో పడినప్పటి నుండి వారి మధ్య మొదలయ్యే పలురకాల సందేహాలను వారు ఎదుర్కొనే సమస్యలను, ఒక ఉద్వేగ భరితమైన రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

కళ్యాణి కోడూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మే చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో రవిబాబు, రావు రమేష్, తాగుబోతు రమేష్, ఉప్పలపాటి నారాయణ , రోహిణి కె.ఎల్. ప్రసాద్ లు నటిస్తున్నారు.

Exit mobile version