బంపర్ ఆఫర్ కొట్టేసిన సుమంత్ అశ్విన్

బంపర్ ఆఫర్ కొట్టేసిన సుమంత్ అశ్విన్

Published on Aug 22, 2012 11:26 PM IST


ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో తన కుమారుడు సుమత అశ్విన్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ తీసిన సినిమా’ తూనీగా తూనీగా’. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాదించలేదు కానీ సుమంత్ అశ్విన్ మాత్రం తన నటనకు మరియు తన డాన్సులకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది, అదేమిటంటే విభిన్న చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ‘అలా మొదలైంది’ చిత్రాన్ని నిర్మించిన దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని వారల క్రితం ఇంద్రగంటి మోహన కృష్ణ మరియు దామోదర్ ప్రసాద్ తమ చిత్రంలో నటించడానికి కొత్త నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చి సెలక్షన్స్ జరిపారు , ఆ సెలక్షన్స్ లో హీరో పాత్రకి ఎవరూ అంతగా నచ్చకపోవడంతో ఈ లవ్ స్టోరీలో నటించే అవకాశం సుమంత్ అశ్విన్ కి లబించింది. కల్యాణి మాళిక్ సంగీతం అందించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు