ఫోటో మూమెంట్: వేవ్స్ సమిట్ దగ్గర మెగాస్టార్ తో ఇండియాస్ బిగ్ స్టార్స్

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ కి ఈ మధ్య కాలంలో పలు అరుదైన గౌరవాలు కూడా వరించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ రంగం పరంగా వేవ్స్ అంటూ స్టార్ట్ చేసి ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ని అత్యాధునిక సదుపాయాలతో గ్లోబల్ లెవెల్లో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా ఈ మధ్యలో టెలివిజన్ యాడ్స్ కూడా వస్తుండగా ఈ వేవ్స్ సమిట్ నేడు ముంబై జాస్మిన్ హాల్ లో అట్టహాసంగా నేడు జరిగింది. అయితే ఈ ఈవెంట్ కోసం దేశ వ్యాప్తంగా అనేకమంది బిగ్ స్టార్స్ కూడా వచ్చారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాగా తనతో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే మెహన్ లాల్ ఇంకా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ లు కూడా వచ్చారు. ఇలా ఈ అందరి బిగ్ స్టార్స్ సమాహారం కలిసిన కొన్ని రేర్ పిక్స్ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. మరి చిరు మిడిల్ లో కనిపిస్తూ ఈ ఇతర బిగ్ స్టార్స్ అంతా కనిపించడం ఇపుడు బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది.

Exit mobile version