ఇండియన్ ఐడల్ 5 విజేత, సింగర్ శ్రీ రామ చంద్ర హీరోగా మారుతున్నాడు. ‘ప్రేమ గీమ జాన్తా నై’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఐ హేట్ లవ్ అనే ట్యాగ్ లైన్ జత చేసారు. ఈ సినిమా ద్వారా హీరోతో పాటుగా సుబ్బు అనే నూతన దర్శకుడు కూడా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాని ఫుల్ కామెడీగా తీయబోతున్నామని దర్శకుడు సుబ్బు చెబుతున్నారు. నవంబర్లో సినిమా ప్రారంభించి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాడి బాల భాస్కర్, ముద్దల భాస్కర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.