మన ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే మన తెలుగు సినిమా “బాహుబలి” ఒక సెన్సేషన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దర్శక ధీరుడు రాజమౌళిల కాంబోలో వచ్చిన ఈ సిరీస్ మన దేశంలో ఏ సినిమాకు కూడా రాని స్థాయి భారీ వసూళ్లను రాబట్టి అన్ని ఇండస్ట్రీలలో కూడా దుమ్ము లేపేసింది. ఈ రెండు చిత్రాలు కలిపి సృష్టించిన వండర్స్ అన్ని ఇన్ని కాదు.
మరి అలాంటి ఈ ఎపిక్ విజువల్ వండర్ ఇప్పుడు మన దేశంలో మళ్ళీ రీ రిలీజ్ కావడానికి రెడీగా ఉందట. మొదటగా “బాహుబలి ది బిగినింగ్” ఈ శుక్రవారం విడుదల కానుండగా “బాహుబలి ది కంక్లూషన్” ఆ వచ్చే శుక్రవారం ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని సిటీస్ లో విడుదల చేయనున్నారట.
లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో దగ్గుబాటి రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా ఇలా ఎందరో అగ్ర నటులు కనిపించిన ఈ భారీ ఎపిక్ వండర్స్ థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇప్పటికే యూఎస్ లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే.