తాను బాలకృష్ణ సినిమాలో నటించట్లేదని చెప్పిన ఎరికా ఫెర్నాండేజ్

తాను బాలకృష్ణ సినిమాలో నటించట్లేదని చెప్పిన ఎరికా ఫెర్నాండేజ్

Published on Jun 13, 2013 11:50 PM IST

Erica-Fernandes
బాలయ్య – బోయపాటి శ్రీనుల సినిమా మొదలైన నాటినుండి ఆ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే దానిపై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే పలు మీడియా సైట్లు ఈ సినిమాలో బాలయ్య సరసన ఇదివరకు మిస్ మహారాష్ట్ర అయిన ఎరికా ఫెర్నాండేజ్ నటిస్తుందని తెలిపారు. అయితే ఆమె ఈ వార్తలను కొట్టిపారేసింది. ” బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నాను అన్న వార్త కేవలం పుకారు మాత్రమే” అని ట్వీట్ చేసింది. ఈ భామ త్వరలో ‘డేగ’ అనే సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్ దశలోవుంది.ఈ సినిమా కాకుండా ఈమె మరో రెండు తమిళ సినిమాలో నటిస్తుంది.

తాజా వార్తలు