ఇలియానాకి తెగ నచ్చేసిందంట.!

ఇలియానాకి తెగ నచ్చేసిందంట.!

Published on Nov 12, 2012 9:12 PM IST


తెలుగు సినిమాల్లో నటించి బాగా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా. ఇక్కడున్న క్రేజ్ తో ఇలియానా బాలీవుడ్లో ‘బర్ఫీ’ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ కి మకాం మార్చేయాలి అనుకున్న ఇలియానా గత కొన్ని రోజులుగా ముంబైలో సరైన ఇల్లు కోసం ఎతుకుతున్నారని మేము ఇది వరకే తెలిపాము. తాజాగా ఇలియానా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కున్నారు. అక్కడ వాతావరణం మరియు కొత్త ఇల్లు ఎలా ఉందని ఇలియానాని అడిగితే ‘ నా కొత్త ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. నా సొంత ఇల్లు ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉంది. నేను మోడల్ గా నా ప్రస్థానం ప్రారంభించిన ముంబైలో ఇప్పటికి సొంత ఇల్లు కొనుక్కోవడం చాలా ఆనందంగా ఉందని’ ఆమె అన్నారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన హిందీలో ఓ సినిమా చేస్తున్న ఇలియానాకి సౌత్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం గమనార్హం.

తాజా వార్తలు