సౌత్ ఇండియాలో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు సౌత్ ని విడిచి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షంచు కుంటోంది. మొదటి సినిమా సక్సెస్ అయినా రెండవ సినిమా ఫట్ మనడంతో కాస్త నిరుత్సాహపడినా ఆ తర్వాత చేసిన ‘మెయిన్ తేరా హీరో’ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకుంది.
తాజాగా ఇలియానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లవ్ అనే దాని నుంచి ఏమి నేర్చుకున్నారు? అలాగే లవ్ గురించి తెలిసాక మళ్ళీ అదే తప్పు చేసారా? అని అడిగితే ‘ఎప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఎవరి కోసం నువ్వు మారకు ఎందుకంటే ఎవ్వరూ నీకోసం మారరు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో చూసాకే లవ్ చేస్తారు, గౌరవం ఇస్తారు. అదే లేకపోతే నిన్ను పట్టించుకోరు. నా వరకూ ప్రేమలో నేనొక ఫూల్ అని చెప్పాలి. నేను కంప్లీట్ రొమాంటిక్ అందుకే గతంలో కొన్ని సిల్లీ పనులు చేసాను. లవ్ గురించి తెలిసాక అదే మిస్టేక్ మళ్ళీ చేయలేదని’ సమాధానం ఇచ్చింది.