గొప్ప సంగీత దర్శకులు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రపంచం లోని మొదటి 25 గొప్ప సంగీత దర్శకుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితా ప్రసిద్ధ సినిమా పోర్టల్ అయిన ‘టేస్ట్ ఆఫ్ సినిమా’ విడుదల చేసింది. భారతదేశం నుంచి ఈ జాబితా లో ఇళయరాజా ఒక్కరే చోటు సంపాదించుకున్నారు. ఆయనది తొమ్మిదవ స్థానం. ఈ జాబితా లో ఇంకా హన్స్ జిమ్మర్ మరియు జాన్ విల్లియమ్స్ వున్నారు.
ఇప్పటివరకు ఇళయరాజా తమిళ్ తెలుగు హిందీ మలయాళం కన్నడ మరాఠీ ఇంగ్లీష్ బాషల్లో 950 చిత్రాలకి సంగీతం అందించారు. ప్రస్తుతం గుణశేఖర్ ‘రుద్రమ దేవి’ కోసం ఆయన పని చేస్తున్నారు.