తిరిగిమొగుతున్న ఇళయరాజా భాజా

Ilayaraja
చిన్న అపశృతి తరువాత సంగీతమాంత్రికుడు ఇళయరాజా తిరిగి రంగంలోకి దగారు. ఆయన ఛాతీ నొప్పితో స్వల్ప గుండెపోటుకు గురైన సంగతి తెలిసినదే. ఈ వార్త విని దాదాపు దక్షిణాది సినీప్రజలంతా దిగ్బ్రంతికి లోనయినా డాక్టర్లు కంగారుపడాల్సిన అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్నారు

ఈయన కొన్ని వారాల క్రితం ఒక కాన్సెర్ట్ ఇవ్వడంకోసం మలేసియా వెళ్లాల్సివుంది. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే ఇప్పుడు అనారోగ్యం నుండి కోలుకున్నారని, పాటలు కూడా కంపోజ్ చేస్తున్నారని తెలిసింది. ఈ నెలలో దక్షిణాఫ్రికా చలనచిత్ర వేడుకలలో ఆయన స్వరపరిచిన గుండెల్లో గోదారి సినిమా ప్రదర్శితం కానుంది

గుణశేఖర్ ‘రుద్రమదేవి 3డి’లో రాజా మరోసారి హృదయాన్ని తాకే సంగీతం ఇవ్వనున్నారు. ఈ సినిమాలో అనుష్క, రాణా ప్రధానపాత్రధారులు

Exit mobile version