ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్..

ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్..

Published on Mar 3, 2013 1:13 PM IST

Allu-Arjun-Iddarammailatho
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. మన బండ్ల గణేష్ గారు శివునికి పరమ భక్తుడని మనకు తెలిసిందే. అలాంటి శివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు జరుపుకునే మహా శివరాత్రి రోజు అనగా మార్చి 10న ‘ఇద్దరంమాయిలతో’ మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది, ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను షూట్ చేస్తున్నారు. బార్సిలోనా షెడ్యూల్ కంటే ముందు బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేసారు. బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 10న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు