24న విడుదలకానున్న ‘ఇద్దరమ్మాయిలతో’ – గణేష్

Iddarammayilatho-Audio-Post

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా మే 24న విడుదలకానుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశాడు. అలాగే ఆ రోజున విడుదల చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నమని కూడా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్టైల్ గా నిర్మించడానికి ఆయన చాలా మార్పులు చేశారు. టెక్నికాల్ టీంను కూడా మార్చారు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ లు హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version