First Posted at 13:31 on Apr 22nd
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో షూట్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అమలా పాల్, కేథరిన్ లతో ఆడిపాడనున్నాడు. ఈ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేష్ ఈ సినిమాని మే 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో లాంచ్ జరిగే అవకాశం ఉంది. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్.