స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఈ నెలలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తైంది. చివరి కట్ ముగిసిందని ఈ సినిమా ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ తెలియజేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలకు మంచి ప్రేక్షకాదరణ లబించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు. రావు రమేష్, బ్రహ్మానందం లు మఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.