నేను బాలీవుడ్ కి సరిపోనంటున్న టాలీవుడ్ హీరో

నేను బాలీవుడ్ కి సరిపోనంటున్న టాలీవుడ్ హీరో

Published on Jul 9, 2012 4:17 PM IST


ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఈగ” చిత్రం ద్వారా హిట్ కొట్టిన హీరో నాని, ఈ చిత్ర విజయాన్ని పంచుకోవడం కోసం ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాని మాట్లాడుతూ ” ‘ఈగ’ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ చిత్రంలో నా నటన చాలా బాగుందని చాలా మెసేజ్ లు మరియు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మరియు కథలో ఇంకొన్ని ప్రేమ సన్నివేశాలు చేసుంటే బాగుండేదని అందరూ అంటున్నారు. ఈ చిత్రంతో దక్షిణాది మొత్తం తనని గుర్తు పడుతున్నారని మరియు ఉత్తరాదిలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లబిస్తోందని అన్నాడు “. అయితే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నారుగా మరి బాలీవుడ్ ప్రయాణం ఎప్పుడు? అని అడిగిన ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ ” నేను అసలు బాలీవుడ్ హీరోగా పనికిరానేమో? ఎందుకంటే నేను అచ్చ తెలుగు కుర్రాడిలా ఉంటాను, నార్త్ ఇండియా హీరోకి కావాల్సిన పోలికలు నాలో ఉండవు. దక్షిణాది వరకు అయితే ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు కానీ బాలీవుడ్ కి అంటే మాత్రం ఇబ్బంది అయిపోతుందని ” అన్నారు.

ప్రస్తుతం నాని ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ మరియు కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సముద్రఖణి దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ఒక సినిమా చేయనున్నారు.

తాజా వార్తలు