వాళ్ళ కంటే నేనే మంచి యాక్టర్ అంటున్న డైరెక్టర్


‘శివ పుత్రుడు’, ‘నేను దేవుణ్ణి’ మరియు ‘వాడు – వీడు’ లాంటి విచిత్రమైన సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన డైరెక్టర్ బాల ‘పరదేశి’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఏమన్నా అడిగితే సూటిగా సమాధానమిచ్చే ఈ వెరైటీ డైరెక్టర్ ని ఇప్పటివరకూ మీరు పనిచేసిన విక్రమ్, సూర్య, ఆర్య, విశాల్ మరియు అధర్వ లలో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరిని ఎన్నుకుంటారని అడగగా వాళ్ళందరికంటే నేనే మంచి యాక్టర్ ని అనే సమాధానమిచ్చి అడిగినవారిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇండస్ట్రీలో ఎవరినన్నా ఇలాంటి ప్రశ్న అడిగితే ఎవరో ఒకరి పేరు చెప్పడమో లేక అందరూ మంచి యాక్టర్లు అని చెప్పడమో చేస్తుంటారు కానీ బాల మాత్రం నేనే బెస్ట్ అని చెప్పి మరోసారి తన మెంటాలిటీని బయటపెట్టాడు.

Exit mobile version