మహేష్ బాబు పరిశ్రమలోకి వచ్చి దాదాపుగా 13 సంవత్సరాలు దాటింది. తన కెరీర్ లో అయన పలు రకాల పాత్రలను పోషించారు. పోలీస్ అధికారిగా, కౌబాయ్ గా, హంతకుడు కూడా చేసారు. చాలా రోజుల నుండి అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఒక్కటే “మహేష్ బాబు ఎప్పుడు జేమ్స్ బాండ్ లాంటి చిత్రం చేస్తారు?” గతంలో సూపర్ స్టార్ కృష్ణ “గూడాచారి 116” అందరి మనసులో నిలిచిపోయిన చిత్రం. ఈ చిత్రం 70లలో భారీ విజయం సాదించింది. ఈ మధ్య జేమ్స్ బ్యాండ్ చిత్రం వంటి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు అని మహేష్ బాబు ని ప్రశ్నించగా “నాక్కూడా స్పై థ్రిల్లర్ చిత్రాలు చెయ్యడం చాలా ఇష్టం కాని అటువంటి చిత్రాలకు మంచి కథ మరియు మంచి దర్శకుడు ఉండాలి కదా” అని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే మహేష్ బాబు ఇటువంటి చిత్రాన్ని చెయ్యడానికి సిద్దం గానే ఉన్నారు. తెలుగు పరిశ్రమలో అటువంటి కథతో మహేష్ బాబు వద్దకు ఏ దర్శకుడు వెళతారో చూడాలి మరి. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు.