హీరో రవితేజకి, డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘కిక్’. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా ఒక స్థాయి తెచ్చిపెట్టిన సినిమా కూడా కిక్ అనే చెప్పుకోవొచ్చు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మళ్ళి జత కట్టారు. వీరిద్దరు కలిసి చేస్తున్న తాజా చిత్రం ‘రేస్ గుర్రం’. ఈ సినిమా పాటల విడుదల ఆదివారం పార్క్ హయ్యత్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గున్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ”అనుకోకుండా కొన్ని రోజుల క్రితం కిక్ సినిమా చూసాను, అది నాకు చాల కిక్ ఇచ్చింది. ఆ సినిమా లో నేను హీరోగా నటించి ఉంటె బాగుండు అని అనిపించింది. సినిమా లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది” అని అన్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో అల్లు అర్జున్ లకు మంచి పేరు రావాలని, రేస్ గుర్రం సినిమా మంచి హిట్ అవ్వాలని చిరంజీవి కోరుకున్నారు.