కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘గ్రీకు వీరుడు’ ఆడియో లాంచ్ నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకలో నాగార్జున కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ చేసారు. నాగ్ మాట్లాడుతూ ‘ చాలా మంది మీరింత యూత్ ఫుల్ లుక్ లో కనిపించడానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నారు. నా ఫ్యాన్స్ నాకిచ్చిన పాజిటివ్ ఎనర్జీనే నన్ను ఇంత యంగ్ గా, వరుసగా సినిమాలు చేసేలా చేస్తోంది. అలాగే ఇటీవలే కొంతమంది మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు అని అడిగారు. అలాంటి అనుమానాలు ఏమీ పెట్టు కోవద్దు. నేను సినీ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వను. ఒక సందర్భంలో నాగ చైతన్య, అఖిల్ రిటైర్ కావచ్చు కానీ నేను రిటైర్ అవ్వను అని’ అన్నారు. ఏప్రిల్ లో విడుదలకి సిద్దమవుతున్న గ్రీకు వీరుడు’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి దశరథ్ దర్శకత్వం వహించాడు. కామక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.